Saturday, April 27, 2024

Viral video: ప్లాట్‌ఫారమ్ గ్యాప్‌లో పడిపోయిన మహిళా.. కానిస్టేబుల్ ఏం చేశాడంటే..

కదులుతున్న రైలు ఎక్కుతు కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఒడిశాలోని భువనేశ్వర్‌లో కదులుతున్న రైలు నుంచి ఓ మహిళ జారిపడింది. అయితే, అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మహిళను రక్షించారు. వివరాల్లోకి వెళితే.. పలాస-కటక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు భువనేశ్వర్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఇచ్ఛాపూర్ ప్రాంతానికి చెందిన కె సరస్వతి (58) అనే ప్రయాణికురాలు పలాస-కటక్ మెము ప్యాసింజర్ ఉదయం 10.10 గంటల ప్రాంతంలో స్టేషన్‌కు బయలుదేరే సమయంలో బ్యాలెన్స్ తప్పి కింద పడింది. ఘటనా స్థలంలో ఉన్న ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సునరామ్ ముండా వెంటనే మహిళను పైకి లేపి ప్రాణాపాయం నుంచి కాపాడారు. మరో మహిళ బి చంద్రమ్మ కూడా సరస్వతితో హడావుడిగా దిగింది. ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్  చాకచక్యంగా వ్యవహరించి ఆమెను రక్షించాడు. ఇది స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. మహిళను రక్షించిన కానిస్టేబుల్‌ ముండాపై అధికారులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement