Monday, April 15, 2024

Covid-19: దేశంలో కరోనా విజృంభణ.. మళ్లీ 3 వేలకు చేరువైన కేసులు..

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు వారి కేసులు ఓ రోజు తగ్గుతూ… మరో రోజు పెరుగుతున్నాయి. తాజాగా పాజిటివ్ కేసులు సంఖ్య మరోసారి మూడు వేలకు చేరువైయ్యాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 2827 నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,13,413 కు చేరింది. ఇందులో 4,25,70,165 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజాగా 24 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,24,181కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3230 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 99.20 శాతంగా ఉంది. ఇక దేశంలో 19,067 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,90,83,96,788 మందికి కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement