Saturday, March 25, 2023

బంద్ కు టీఆర్ఎస్ దూరం..

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అయితే తెలంగాణలో మాత్రం బంద్ ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. ఓ పక్క ఆంద్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం బంద్ కు మద్దతు ఇవ్వడమే కాకుండా నిరసనలకు కూడా దిగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చాలా చోట్ల నిరసలు కొనసాగుతున్నాయి. ఈ విధంగానైనా తమ అసంతృప్తిని కేంద్రానికి చాటిచెబుతున్నారు ఏపీ రాజకీయనాకులు, పలు కార్మిక సంఘాలు. ఇంకా చెప్పాలంటే ఈ భారత్ బంద్ ని నిరసనలు తెలిపేందుకు ఓ మంచి అవకాశంగా వారు భావిస్తున్నారు. కార్మిక సంఘాలు ప్రత్యక్షంగా బంద్ లో పాల్గొంటూ నిరసనలు తెలియజేస్తున్నారు.

మరోవైపు..ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలతో విరుచుకుపడే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు బంద్ కు మద్దతు ఇవ్వడం లేదనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. మొన్నటికి మొన్న మంత్రి కేటీఆర్ బీజేపీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా పై విరుచుకుపడ్డారు కేటీఆర్…మీ మీద మేం కూడ మాట్లాడలేమా అని బీజేపీ నేతలను ఉద్దేశ్యించి ప్రశ్నించారు కేటీఆర్. మేం మాట్లాడటం మొదలు పెడితే తట్టుకోలేరు అని బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. నాకు, మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్ సహా మా నేతలకు కేసీఆర్ ట్రైనింగ్ ఉంది. మేము కూడా తిట్టడం మొదలుపెడితే తట్టుకోలేరు అని కామెంట్ చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణకు అణా పైసా కూడా ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షి గా విమర్శలు చేశారు కేటీఆర్. ఇక సీఎం కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు బీజేపీ ని విమర్శించడంలో కేసీఆర్ తరువాతే ఎవరైనా అన్నట్లు ఆయన పదజాలం ఉపయోగిస్తారు. అప్పట్లో మోదీని సైతం సన్యాసి అని ఘాటుగా విమర్శిచారు కేసీఆర్. అంతేకాదు ప్లాట్ ఫామ్ ఏదైనా అవకాశం ఉంటే బీజేపీపై విరుచుకుపడటానికి ఎప్పుడు సిద్దంగా ఉంటారు మిగతా టీఆర్ ఎస్ నాయకులు. అలాంటి టీఆర్ ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగుతున్న బంద్ కు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇదే అందరిని తొలచివేస్తున్న ప్రశ్న.

- Advertisement -
   

డిసెంబరులో కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన్నప్పటికి నుంచి తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయనేది విస్పష్టం. ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ అంతర్గతంగా ఒప్పంద కుదుర్చుకున్నారనేది ప్రతిపక్షాల వాదన. రాజకీయ పండితులు కూడా బీజేపీ, టీఆర్ఎస్ పైకి కలిసి పనిచేయకపోయిన లోపల మాత్రం ఇరు పార్టీలు సహకరించుకుంటాయని అప్పట్లో విశ్లేషణలు కూడా చేశారు. ఇప్పుడు దానికి తగ్గట్లే టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పైకి ఇరు పార్టీలపై విమర్శలు చేసుకున్నప్పటికి అంతర్గతంగా సహకరించుకుంటున్నారనేది కాంగ్రేస్ నాయకుల వాదన. ఇప్పుడు ఆ వాదనకు బలం చేకూర్చే విధంగానే ఉంది టీఆర్ ఎస్ వ్యవహారం సాగుతోంది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భరత్ బంద్ జరుగుతోంది కాబట్టి….టీఆర్ ఎస్ బంద్ కు మద్దతు ఇవ్వాల్సింది కాని..తెలంగాణలో ఎక్కడా బంద్ ఎఫెక్ట్ లేదు. రోడ్లపై ఎక్కడా బంద్ వాతావరణ కనిపించడం లేదు. అయితే గతంలో రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతునిచ్చింది. జీహెచ్ హెంసీ ఎన్నికల్ల తరువాత జరిగిన ఆ బంద్ లో టీఆర్ఎస్ నాయకులంతా రోడ్లపైకొచ్చారు. మంత్రులు కేటీఆర్ హరీష్ రావు సహా పార్టీనేతలతో ఆందోళనలు నిర్వహించారు. అయితే ఇప్పుడు రైతు సంఘాలు పిలుపునిచ్చిన బంద్ కి టీఆర్ఎస్ మద్దతు తెలపకపోవడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో నిజంగానే టీఆర్ఎస్ బీజేపీలు ఓ ఒప్పందానికి వచ్చాయని ఇప్పుడు కాంగ్రేస్ నాయకులు విమర్శిస్తున్నారు. చూడాలి మరీ ఈ సారి ఇరు పార్టీల నాయకులు ఏం సమాధానం చెబుతారో.

Advertisement

తాజా వార్తలు

Advertisement