Friday, December 6, 2024

రెండు రాష్ట్రాలు- 77 స్థానాలుఃరేపే కీల‌క‌నేత‌ల‌కు ఓటు ప‌రీక్ష‌…

కోల్‌కత్తా, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్‌ జరిగే అస్సోంలోని 47, పశ్చిమబెంగాల్‌ లోని 30 స్థానాల్లో గురువారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. తొలి విడత ఎన్నికలు మార్చి 27న జరగనున్నాయి. ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన ఉత్తర్వుల మేరకు పోలింగ్‌ ముగిసే 48గంటల ముందు ప్రచారానికి పుల్‌స్టాప్‌ పడింది. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోని 77 అసెంబ్లీ సీట్ల పరిధిలో గత పదిరోజులుగా హోరెత్తిన ప్రచారం మూగ బోయింది. అస్సోంలో అధికార బిజెపి తిరిగి పట్టు నిలుపు కోవాలని ప్రయత్నిస్తోంది. పశ్చిమబెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ను తరిమికొట్టేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి ఈశాన్య రాష్ట్రం అస్సోంలోని మొత్తం 126 స్థానా లకు గాను వందకుపైగా స్థానాల్లో గెలుపు సాధించాలని బిజెపి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఆ పార్టీ అస్సోం గణ పరిషత్‌, యునైటెడ్‌ పీపుల్స్‌ పార్టీ లిబరల్‌లతో జత కట్టింది. మరోవైపు కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఎమ్‌, సిపిఐ ఎమ్‌ఎల్‌, ఎయుయుబిఎఫ్‌, అంచాలిక్‌ గణమోర్చా, బోడో ల్యాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ల్తో కలసి కూటమికట్టింది. ఇదిలా ఉంటే అస్సోం జాతీయ పరిషత్‌, రైజోర్‌దల్‌ అనే ప్రాంతీయ పార్టీలు మరో కూటమిగా ఏర్పడి బరిలో దిగాయి. అస్సోం లో గత ఐదేళ్ళుగా బిజెపి అధికారంలో ఉంది. మరోసారి విజయం సాధించి అధికారాన్ని నిలుపుకుంటే ఇది ఈశాన్య రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ రాష్ట్రాల్లో బిజెపి పట్టును పెంచుతుంది. గత కొన్నాళ్ళుగా ప్రధాని నరేంద్రమోడీ ఈస్ట్‌ పాలసీని అనుసరిస్తున్నారు. ఈ దశలో అస్సోంలో పట్టు నిలుపుకోవడం బిజెపికి ప్రతిష్టా త్మకంగా మారింది. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమత నేతృత్వంలోని తృణ మూల్‌ను గద్దె దించడమే లక్ష్యంగా బిజెపి యుద్దం చేస్తోంది. వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తృణమూల్‌ ప్రయత్నాలు సాగిస్తోంది.
అస్సోం ఎన్నికల తొలి దశలోనే ఆ రాష్ట్రంలో ముగ్గురు కీల క నేతల భవితవ్యం తేలిపోనుంది. ముగ్గురు అగ్రనేతల రాజకీయ భవిష్యత్‌ను మార్చి 27న జరిగే తొలి దశ ఎన్నిక ల్లోనే అస్సోం ఓటర్లు నిర్ణయించనున్నారు. ముఖ్యమంత్రి సార్భానంద సునోవాల్‌ మజురి జిల్లాలోని మజురి నియో జకవర్గం నుంచి బిజెపి అభ్యర్ధిగా పోటీ పడుతున్నారు. ఆయ నిక్కడ్నుంచి బరిలో దిగడం వరుసగా రెండోసారి. కాగా అస్సోం గణ పరిషత్‌ అధ్యక్షుడు, బిజెపి కూటమిలోని భాగ స్వామి అతుల్‌బోరా బోలఘాట్‌ జిల్లాలోని బోకాఖాట్లో, అస్సోం కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రిపున్‌ బోరా బిశ్వనాధ్‌ జల్లాలోని గోహ్పూర్‌లో తన అధృష్టాన్ని పరీక్షిం చుకుం టున్నారు. సోనోవర్‌ ప్రధానంగా రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పిస్తామన్న హామీతో ముందుకెళ్తున్నారు. పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోకు అదనంగా ఆయన తన నియోజక వర్గంలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించి హామీలు గుప్పి స్తున్నారు. స్థానికంగా అందుబాటులో ఉంటానని పేర్కొం టున్నారు. కాగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రిపున్‌బోరా ఐదు ప్రధాన హామీల్తో ఎన్నికల్ని ఎదుర్కొంటున్నారు. మజురి నియోజకవర్గంలో సోనోవల్‌ ప్రధానంగా కాంగ్రెస్‌ అభ్యర్ధి రాజీవ్‌లోచన్‌పెగుతో పోటీ పడుతున్నారు. ఆయన్తో పాటు సోషలిస్ట్‌ యూనిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన అభ్యర్ది బైతీరిచాన్‌, అస్సోం జాతీయ పరిషత్‌ అభ్యర్ధి శిశుధర్‌డోలే, స్వతంత్ర అభ్యర్ధి పూర్ణాపెగుల నుంచి పోటీనెదుర్కొం టున్నా రు. మజురి నియోజకవర్గంలో మొత్తం 1,32,016మంది ఓటర్లున్నారు. వీరిలో 67,177మంది పురుషులు కాగా 64,838మంది మహిళలు, ఒకరు ఇతరులున్నారు. వీరి కోసం మజురి నియోజకవర్గంలో 185పోలింగ్‌ కేంద్రాల్నే ర్పాటు చేశారు. గతెన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి సోనోవల్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి రాజీవ్‌లోచన్‌ పెగును 18,923 ఓట్లతో ఓడించారు. అప్పటి ఎన్నికల్లో పెగుకు 30,679 ఓట్లొస్తే సోనోవల్‌కు 49,602ఓట్లు లభించాయి. కాగా ఎజిపి అధ్యక్షుడు అతుల్‌ బోరా బోకాఖట్‌ నియోజకవర్గం నుంచి పదిమంది ప్రత్య ర్ధుల్ని ఎదుర్కొంటున్నారు. ఇందులో నేషన లిస్ట్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి మృదుల్‌సైక్యా, ఎజెపి అభ్యర్ధి రెబా కాంత్‌ గోగోయ్‌లు గట్టిపోటీనిస్తున్నారు. వీరుకాక మరో 8మంది స్వతంత్రులు ఇక్కడ బరిలో ఉన్నారు. ఇక్కడ మొ త్తం 1,47,487మంది ఓటర్లున్నారు. వీరిలో 73,798మంది పురుషులు, 73,686మంది మహిళలు, కాగా ముగ్గురు ఇత రులున్నారు. గతెన్నికల్లో అతుల్‌ బోరా 40,193ఓట్ల ఆధిక్యం తో కాంగ్రెస్‌ కు చెందిన అరుణ్‌ఫుకాన్‌ను ఓడించారు. ఆ ఎన్నికల్లో బోరాకు 62,962ఓట్లొస్తే ఫుకాన్‌కు 22,769ఓట్లు మాత్రమే లభించాయి. కాగా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రిపున్‌ బోరాతో గోహ్పూర్‌లో నలుగురు అభ్యర్ధులు తలప డుతున్నారు. వీరిలో బిజెపికి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉత్ప ల్‌ బోరాతో పోటీ కీలకం. కాగా ఎజెపి అభ్యర్ధి గోపాల్‌ఫుకాన్‌, ఓటర్స్‌ పార్టీ ఇంటర్నేషనల్‌ అభ్యర్ధి సబీర్‌ నజ్జరీ కూడా గట్టిపోటీనిస్తున్నారు. బిశ్వానంద్‌ జిల్లాలోని గోహ్పూర్‌ నియోజకవర్గంలో 2,04,227మంది ఓటర్లున్నారు. వీరిలో 1,03,433మంది పురుషులు, 1,00,787మంది మహిళలు, ఏడుగురు ఇతరులున్నారు. గతెన్నికల్లో రిపున్‌బోరాను బిజెపికి చెందిన ఉత్పల్‌బోరా 28,935ఓట్ల తేడాతో ఓడిం చారు. ఉత్పల్‌బోరాకు 85,424ఓట్లు లభిం చగా రిపున్‌బో రాకు 56,489ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా తొలిదశలోనే అస్సోంలోని కీలకనేతల ఎన్నికలు ముగిసిపోతుండడంతో ఇక వీరంతా మిగిలిన రెండు దశల ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొనే అవకాశం దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement