Monday, May 13, 2024

NetFlix: మారణహోమం సృష్టించిన ఢిల్లీ సీరియల్​ కిల్లర్..​ రియల్​ స్టోరీతో నెట్​ఫ్లిక్స్​లో వెబ్​ సిరీస్!​

ఆన్​లైన్​ స్ట్రీమింగ్​యాప్ నెట్​ఫ్లిక్స్​లో మరో అద్భుతమైన క్రైమ్​, సస్పెన్స్​కు చెందిన వెబ్​ సిరీస్​ రానుంది. ఢిల్లీ, దాని చుట్టుపక్కల జరిగిన యధార్థ ఘటనల ఆధారంగా ఈ వెబ్​సిరీస్​ రూపొందించారు. దేశ రాజధాని, ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ప్రజలను దారుణంగా చంపేస్తూ.. వారి శరీర భాగాలను చెల్లా చెదురుగా పడేస్తూ.. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగిన ఓ హంతకుడి చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ సీరియల్​ కిల్లర్​ కేసుపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తునకు సంబంధించిన కీలక సన్నివేశాలు కూడా ఉండనున్నాయి. ​

కాగా, స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్ మంగళవారం తన తాజా క్రైమ్ డాక్యుమెంట్ -సిరీస్ ‘‘ఇండియన్ ప్రిడేటర్: ది బుట్చర్ ఆఫ్ ఢిల్లీ’’ అనే పేరుతో జూలై 20న వెబ్​ సిరీస్​ రిలీజ్​ చేస్తున్నట్టు ఇవ్వాల (మంగళవారం) ప్రకటించింది. దీనికి ఆయేషా సూద్ దర్శకత్వం వహించగా.. వైస్ ఇండియా నిర్మాణ సారథ్యం వహించింది. ఈ షో నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించినట్టు మేకర్స్​ తెలియజేశారు.  

ఓ క్రూరమైన నర హంతకుడి అరెస్టుకు దారితీసిన సంఘటనల క్రమాన్ని ఈ వెబ్​ సిరీస్​లో చూడొచ్చని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. దేశంలో నాన్-ఫిక్షన్ స్పేస్ రోజు రోజుకూ డెవలప్​ అవుతోందని, రివర్టింగ్ స్టోరీని రూపొందించడంలో భాగమైనందుకు తాను చాలా సంతోషంగా ఉన్నట్టు  డైరెక్టర్​ ఆయేషా తెలిపారు. ఈ కథను, దాని తర్వాత జరిగిన పరిశోధనను అర్థం చేసుకోవడం.. మానవ మేధస్సు, న్యాయ వ్యవస్థ గురించి కూడా చాలా తెలుసుకోవడానికి తనను ముందుకు నడిపించినట్టు తెలిపారు.

https://twitter.com/NetflixIndia/status/1541655228764012544

ఈ డాక్యుమెంట్-సిరీస్ ని నెట్‌ఫ్లిక్స్ లో ప్రదర్శించడానికి తాను ఎంతో ఇంట్రెస్టింగ్​గా ఎదురు చూస్తున్నట్టు చెప్పింది. అప్పట్లో ఈ కేసు దేశాన్ని కుదిపేసి ఉండాల్సింది.. కానీ, ప్రింట్​అండ్​ ఎలక్ట్రానిక్​ మీడియాతో పాటు సోషల్​ మీడియా ఇంతగా డెవలప్ కాలేదన్నారు. అందుకే ఇది జనాలకు తెలియకుండా మిస్ అయ్యిందన్నారు ఆయేషా సూద్​.

Advertisement

తాజా వార్తలు

Advertisement