Friday, May 3, 2024

పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు, తీవ్రమవుతున్న డీజిల్‌ కొరత..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో రోజు రోజుకూ ఇంధన కొరత తీవ్రమవుతోంది. ప్రత్యేకించి డీజిల్‌కు తీవ్ర కొరత ఏర్పడుతోంది. రాష్ట్రంలో నోస్టాక్‌ బోర్డు పెడుతున్న పెట్రోల్‌ బంకుల సంఖ్య రోజు రోజుకూ పె రుగుతోంది. హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు పెట్టడం రివాజుగా మారింది. దీంతో ఏ పెట్రోల్‌ బంకులో ఎప్పుడు పెట్రోల్‌ ఉంటుందో, అయిపోతుందో తెలియని అయోమయ పరిస్థితి వాహనదారుల్లో నెలకొని ఉంది. పెట్రోలియం సంస్థలు పెట్రోల్‌ బంకులకు క్రెడిట్‌ ఇండెంట్‌ను రద్దు చేయడమంతో కొరత కు కారణంగా తెలుస్తోంది.

పెట్రోల్‌ బంకుల యజమానులు రోజూ 20వేల లీటర్ల వరకు ఇండెంట్‌ పెడితే చమురు సంస్థలు కేవలం 4వేలు, 5వేల లీటర్లను మాత్రమే సరఫరా చేస్తున్నాయి. పెట్రోలు బంకులు పెడుతున్న రోజు వారీ ఇండెంట్‌లో కేవలం 60శాతం డీజిల్‌ మాత్రమే సరఫరా అవుతోంది. 35 రోజులుగా డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నా… కొరత మాత్రం వేధిస్తోంది. డీజిల్‌కు తీవ్ర కొరత ఏర్పడడంతో రిలయన్స్‌, ఎస్సార్‌ బంకులు ఎక్కువ ధరకు అమ్ముతున్నాయి. ప్రస్తుతం హెచ్‌పీఎల్‌, భారత్‌ పెట్రోల్‌ బంకుల్లో డీజిల్‌ కొరత ఎక్కువగా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement