Friday, December 6, 2024

గుండెపోటుతో చీతా మృతి

గుండెపోటుతో హైద‌రాబాద్ లోని నెహ్రూ జూలాజిక‌ల్ పార్కులో అబ్దుల్లా అనే చీతా మ‌ర‌ణించింది. కాగా పోస్టుమార్టంలో ఈ చీతా గుండెపోటుతో మరణించినట్టు నిర్ధారణ అయింది. అబ్దుల్లా మగత చీతా. దీని వయసు 15 సంవత్సరాలు. హైదరాబాదు జూలో ఇదే చివరి చీతా. ఇప్పుడు దీని మరణంతో జూలో చీతాలే లేకుండా పోయాయి. అబ్దుల్లా సౌదీ అరేబియాకు చెందిన చీతా. 2011లో సౌదీ రాజ కుటుంబీకులు హైదరాబాదు జూని సందర్శించారు. ఆ తర్వాత రెండు చీతాలను ఈ జూకి అందించారు. వాటిలో ఒకటి ఆడ చీతా కాగా, దాని పేరు హీబా. అది 12 ఏళ్ల వయసులో మరణించింది. ఇప్పుడు దాని జత అబ్దుల్లా కూడా మృతి చెందింది.ఇప్పటివరకు దక్షిణ భారతదేశంలో మైసూర్ తో పాటు హైదరాబాద్ జూలోనే చీతాలు ఉన్నాయి. ఇప్పుడు కేవలం మైసూరులోని చీతాలే మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement