Wednesday, May 8, 2024

Space: ఆకాశంలో మరో అద్భతం.. స్టన్నింగ్ రేర్ ఇమేజెస్ ని షేర్ చేసిన నాసా

ఆకాశంలో మరో అద్భతం గోచరించింది. భూమికి 10వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న రెండు ప్రకాశవంతమైన క్వాసర్లను అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా కనుగొంది. ఈ రెండు ప్రకాశవంతమైన లైట్ల మాదిరిగా ఉండి.. ఒకే వస్తువులో కలిసిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. అవి వాటి గెలాక్సీల నుంచి కాంతిని గ్రహిస్తున్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. మన సూర్యుడి కంటే బిలియన్ రెట్లు ఎక్కువ భారీ బ్లాక్ హోల్స్ ద్వారా శక్తిని పొందుతున్నాయని, ఈ శక్తివంతమైన డైనమోల పట్ల చాలా కాలంగా ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నట్టు నాసా పేర్కొంది. గెలాక్సీ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న క్వాసర్లు 1950 , 1960 లలో మొదటిసారిగా గుర్తించినప్పుడు చిన్న చిన్న నక్షత్రాల వలె కనిపించాయని అందుకనే వాటికి ఆ పేరు వచ్చినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ, అవి స్టార్లు కాదని, ఇప్పటికీ ఎంతో ప్రకాశవంతంగా ఉన్నాయని చెబుతున్నారు. – మన పాలపుంత కంటే 1,000 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉన్నాయని, అంతేకాకుండా చాలా యాక్టివ్ గా కూడా ఉన్నట్టు నాసా పరిశోధనల్లో వెల్లడైంది. మొత్తం విద్యుదయస్కాంత వర్ణపటంలో భారీ మొత్తంలో రేడియేషన్‌ను విడుదల చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

హబుల్ స్పేస్ టెలిస్కోప్‌ను ఉపయోగించి ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త జంట క్వాసార్‌లను కనుగొన్నారని, త్వరలో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ ద్వారా వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు కునుగొంటామని నాసా తెలిపింది. నాసా షేర్ చేసిన ఫొటోలో రెండు ప్రకాశవంతమైన చుక్కలు 10,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రెండు క్వాసార్‌లను అధ్యయనం చేయడం వల్ల గెలాక్సీలు, బ్లాక్ హోల్స్ కలిసి ఎలా అభివృద్ధి చెందుతాయో అర్థం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్వాసార్‌లను అధ్యయనం చేయడం ద్వార విశ్వం యొక్క ప్రారంభ దశలను కూడా అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అపారమైన కాంతిని విడుదల చేస్తున్నప్పటికీ అవి ఇక్కడి నుండి చాలా దూరం ఉన్నందున భూమి నుండి కంటితో కనిపించవు. వాస్తవానికి క్వాసార్ల నుండి శక్తి భూమి యొక్క వాతావరణాన్ని చేరుకోవడానికి బిలియన్ల సంవత్సరాలు పడుతుందంటున్నారు నాసా శాస్త్రవేత్తలు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement