Saturday, April 27, 2024

PM Modi – తొమ్మిదేళ్ల పాలన – జనాకర్షక లాలన…

న్యూఢిల్లి: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్‌డీఏ) ప్రభుత్వం మే 30వ తేదీతో తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ తొమ్మిదేళ్ళ పాలనలో 2016లో నోట్ల రద్దు, 2017లో వస్తు సేవల పన్ను(జీఎస్టీ), పెచ్చ రిల్లిన కొవిడ్‌ మహమ్మారి, దేశ సరిహద్దుల వెంబడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ భారత్‌ స్వయంసమృద్ధి(ఆత్మనిర్భర్‌) కోసం పిలుపులు, సమాజంలో కొత్తగా లబ్దిదారులనే వర్గం ఆవి ర్భావం లాంటి పలు ముఖ్యమైన ఘట్టాలకు గడిచిన తొమ్మి దేళ్ళ కాలం సాక్షిగా నిలిచింది. ఒక స్పష్టమైన మెజార్టీతో 2014 సంవత్సరం మే 26న ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి న నరేంద్ర మోడీ.. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, మ న్మోహన్‌ సింగ్‌ల తర్వాత సుదీర్ఘ కాలం సేవలందిస్తున్న నాల్గవ ప్రధానిగా, కాంగ్రెసేతర పార్టీ నుంచి సుదీర్ఘ కాలం సేవలందిస్తు న్న ప్రధానిగా పేరు గడించారు. తొమ్మిదేళ్ళ మోడీ పాలనలో కీ లకమైన తొమ్మిది అంశాలు ఇక్కడ ప్రస్తావనకు నోచుకున్నాయి.

అనూహ్యమైన ఒడిదుడుకుల్లో వృద్ధి రేటు
గతేడాది బ్రిటన్‌ను తోసిరాజనడం ద్వారా ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది. భారత్‌
కు ముందు స్థానాల్లో అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీ దేశాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇటీవలి సంవత్సరాల్లో భారత్‌ స్థూలజాతీయోత్పత్తి(జీడీపీ) పురోగతి అనూహ్యంగా ఒడిదుడుకులను చవిచూసింది. దీనికి ప్రధాన కారణంగా కొవిడ్‌-19 మహమ్మారి వైపు వేలెత్తి చూపాలి. కొవిడ్‌ కార ణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. దేశీయ ఆర్థిక కార్యకలా పాలను కొవిడ్‌ నిలిపివేయకమునుపే ఆర్థిక వ్యవస్థ తిరోగమ నంలో ఉంది. రూ.1,000, రూ.500 నోట్ల రద్దుకు సాక్షిగా నిలి చిన 2016-17 ఆర్థిక సంవత్సరం 8 శాతానికి పైగా వృద్ధి రేటు ను చవిచూసినప్పటికీ తర్వాతి సంవత్సరాల్లో తిరోగమనం బాట పట్టింది.

2017 సంవత్సరం జులై ఒకటవ తేదీన జీఎస్టీని ప్రవేశపెట్టడంతో పరోక్ష పన్ను విధానంలో చోటు చేసుకున్న మార్పునకు వ్యాపారాలు సర్దుబాటు చేసుకోవడంతో 2017- 18లో 8 శాతం వృద్ధి రేటుతో తర్వాతి సంవత్సరాల్లో భారత్‌ వృ ద్ధి రేటు మందగించింది. 2018-19లో 6.45 శాతంతో 2019 -20లో 3.89 శాతంతో అది మరింత క్షీణించింది. కొవిడ్‌ లాక్‌ డౌన్‌ కాలంలో (2020-21 ఆర్థిక సంవత్సరంలో) వృద్ధి -5.83 శాతానికి పడిపోయింది. అయితే గతేడాది పాతాళానికి పడిపో యిన వైనం ప్రాతిపదికగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు పుంచుకొని 9.05 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత ఒ
క మధ్యేమార్గం అనుసరిస్తున్నట్టుగా 2022-23 ఆర్థిక సంవత్స రానికి వృద్ధి రేటు 7 శాతంగా నమోదైంది. జీడీపీ తరహాలో తలసరి ఆదాయం కూడా అనూహ్యమైన ఒడిదుడుకులను ఎదుర్కొంది. గడచిన తొమ్మిది సంవత్సరాల్లో తలసరి ఆదా యంలో వార్షిక వృద్ధి రేటు -8.86 శాతం నుంచి 7.59 శాతం మధ్య ఊగిసలాడింది.

ఎగసిపడిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)
మోడీ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిన ప్రాంతాల్లో ఒకటిగా పెట్టుబడి మిగిలిపోయింది. దేశీయ ఔత్సాహిక పారి శ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు లను(ఎఫ్‌డీఐలు) ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. పెట్టుబడులను అనువైన ఒక వాతావరణా న్ని సృష్టించడంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, ఆర్థిక వ్యవ స్థకు చెందిన పలు రంగాల కోసం ఎఫ్‌డీఐ పాలసీ సరళీకరణ, శాసనపరమైన సంస్కరణలు, తదితర చర్యలను చేపట్టింది. ఈ చర్యలు కొన్ని ఫలాలను అందించాయి. ఉదాహరణకు 2014 -15 ఆర్థిక సంవత్సరానికి 45 బిలియన్‌ డాలర్లుగా నమోదైన ఎఫ్‌డీఐ.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 84.83 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. అయితే 2022-23 సంవత్సరానికి అది కాస్త తగ్గి 70 బిలియన్‌ డాలర్లకు పరిమితమైపోయింది.

- Advertisement -

సంక్షోభంలో గ్రామీణ భారతం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం(ఎన్‌ఆర్‌యీ జీఎస్‌) పనితీరు గ్రామీణ భారతంలో సంక్షోభానికి అద్దం పట్టే సూచికల్లో ఒకటిగా నిలిచిపోయింది. ప్రతి ఆర్థిక సంవత్సరం లో ప్రతి ఇంట్లోను నైపుణ్యంతో సంబంధం లేని పనులు చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వయోజనులకు 100 రోజుల ఉపాధిని కచ్చితంగా కల్పించే లక్ష్యంతో ఆ పథకం ప్రారంభమైంది. నానాటికి పెరిగిపోతున్న ఎన్‌ఆర్‌యీజీఎస్‌ లబ్దిదారుల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులను ప్రతిబింబిస్తోంది. ఎన్‌ఆర్‌యీజీఎస్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న డాటా ప్రకారం 2014-15 ఆర్థిక సంవ త్సరంలో 4.41 కోట్ల కుటుంబాలు పథకాన్ని వినియోగించుకు న్నాయి. 2020-21లో కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆ సంఖ్య గరిష్టంగా 7.55 కోట్లకు చేరుకుంది. ఆ కాలంలో పట్టణాలకు, నగరాలకు వలసపోయిన అనేక మంది ప్రజలు వారి స్వగ్రామాలకు తిరిగి చేరుకున్నారు. ఆ తర్వాత 2021-22 లో పథకాన్ని వినియోగించుకున్న కుటుంబాల సంఖ్య 7.25 కోట్లుగా ఉంది. అయినప్పటికీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 6.18 కోట్లుగా ఉంది.

మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి
గడచిన తొమ్మిదేళ్ళ కాలంలో మోడీ సర్కారు ప్రధానంగా దృష్టి పెట్టిన వాటిల్లో మౌలిక సదుపాయల కల్పన ఒకటి. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు ఇలా ఏ రంగంలో చూసిన మౌలిక సదుపాయల కల్పనకు సంబంధించిన ప్రాజె క్టులు సంఖ్యలోనూ, వాటి పరిమాణంలోనూ అనూహ్యమైన పెరుగుదల కనిపించింది.
ఇది గత కొద్ది సంవత్సరాలుగా వాటికి పెరుగుతున్న మూలధన పెట్టుబడిపై ప్రతిఫలించింది. జాతీయ రహదారుల నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి మోడీ సర్కారు విజయగాథల్లో ఒకటిగా నిలిచిపోతుంది. అయితే బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు లాంటి పలు పెద్ద ప్రాజెక్టులు నేటికి వెలుగు చూడలేదు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో దేశంలో మొత్తం జాతీయ రహదారుల నిడివి 97,830 కి.మీ.లు ఉండగా 2022 డిసెంబర్‌ మాసాంతానికి అది 1,44,955 కి.మీ.లకు చేరుకుంది.

అరకొరగా ఆరోగ్యం
ఎన్డీయే ప్రభుత్వం గడిచిన తొమ్మిదేళ్ళల్లో ఎదుర్కొన్న అతి పెద్ద సవాళ్ళలో ఒకటిగా కొవిడ్‌ మహమ్మారి నిలిచిపో తుంది. అయితే అందుబాటులో ఉన్న డాటా ప్రకా రం ఆరోగ్య రంగానికి చేస్తు న్న ఖర్చు(జీడీపీ శాతం ప్రకా రం) పెద్దగా మార్పు కనిపించలేదు. 201 4-15 ఆర్థిక సంవ త్సరం నుంచి 20 22-23 మధ్య కా లంలో ఆరోగ్యానికి పెట్టిన ఖర్చు 1.2 శా తం నుంచి 2.2 శా తం మధ్య ఊగి సలాడింది. ప్ర స్తుతం ఆరోగ్య రంగానికి చేసిన ఖర్చులో కేంద్ర ప్రభుత్వ వాటా కేవ లం 12 శాతానికి కాస్త ఎక్కువగా ఉంది. 2019- 20 ఆర్థిక సంవత్సరానికి నేషనల్‌ హెల్త్‌ అకౌ ంట్స్‌ ఫర్‌ ఇండియా ప్రకారం ”ఆరోగ్య రంగా నికి ప్రస్తుతం చేసిన ఖర్చు లో కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 72,059 కోట్లు(12.14 శాతం), రాష్ట్ర ప్రభుత్వాల వాటా రూ.1,18, 927 కోట్లు(20.03 శాతం), స్థానిక సంస్థల వాటా రూ.5,844 కోట్లు(0.99 శాతం), కుటుంబాల వాటా (ఇన్సురెన్స్‌ ప్రీమియంలను కలుపుకొని) దాదాపు రూ. 3,51, 717 కోట్లు(59.24 శాతం), అనూహ్యమైన ఖర్చు 52 శాతంగా ఉంది”.

విద్యారంగానికి అంతంతమాత్రమే
ఆరోగ్య రంగం తరహాలో వైద్య రంగానికి చేస్తున్న ఖర్చు
కూడా కనిష్టంగా ఉంది. కొత్త విద్యా విధానం రంగప్రవేశంతో విద్యా రంగం అతి పెద్ద సంస్కరణకు సాక్షిగా నిలిచినప్పటికీ జీడీపీతో శాతంలో చూసినప్పుడు గడచిన తొమ్మిదేళ్ళలో విద్యారంగానికి చేసిన ఖర్చు 2.8 శాతం నుంచి 2.9 శాతం మధ్య ఊగిసలాడుతోంది.

కనిష్టంగా పన్ను-జీడీపి నిష్పత్తి,
కరెన్సీ వాడకంలో పెరుగుదల
పెద్ద నోట్లన రద్దు చేస్తూ 2016 నవంబర్‌లో ప్రభుత్వం
ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. నల్లధనాన్ని అరికట్టడానికి, నగదు వాడకాన్ని తగ్గించడానికి ఆ నిర్ణయం చేపట్టింది. అయితే అటు పన్ను-జీడీపీ నిష్పత్తిలో పెరుగుదల చోటు చేసుకోలేదు సరికదా నగదు వాడకం ఏ మాత్రం తగ్గిపోలేదు. ఉదాహరణకు గడచిన తొమ్మిదేళ్లలో ప్రత్యక్ష పన్ను-జీడీపీ నిష్పత్తి 4.78 నుంచి 6.02 శాతం మ ధ్య నిలిచిపోయింది. అందుకు విరు ద్ధంగా కరెన్సీ-జీడీపీ నిష్పత్తి 2014 -15 ఆర్థిక సంవత్స రంలో 11.6 శాతం నుంచి 2020- 21 లో 14.4 శాతానికి పెరిగిపో యింది. అయితే 2021-22 లో 13.7 శాతంతో అది స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. యూపీ ఏ లాంటి కొత్త చర్యలతో డిజి టల్‌ లావాదేవీలకు ఊతమిచ్చి నప్పటికీ నగదు వినియోగం ఇప్ప టికీ వృద్ధిలో ఉందనే వాస్తవాన్ని పై గణాంకాలు సూచిస్తున్నాయి.

ప్రపంచ వాణిజ్య ఎగుమతుల్లో కనిష్టం
ఇటీవలి సంవత్సరాల్లో ప్రభు త్వం మేకిన్‌ ఇండియాపై దృష్టి పెట్టింది. కొవిడ్‌19 మహ మ్మారి కాలంలో ఆత్మనిర్భర్‌ భారత్‌ ను ఆరంభించింది. అయితే తాజా డాటా ప్రకారం ప్రపంచ వాణిజ్య ఎగు మతుల్లో భారత్‌ వాటా ఇటీవలి సంవ త్సరాల్లో నిశ్చలంగా ఉంది. 2014లో 1.69 శాతం నుంచి కాస్త వృద్ధితో 1.77 శాతానికి పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement