Sunday, October 6, 2024

Sangareddy : పేలిన గ్యాస్ సిలిండర్.. పరుగులు తీసిన జనం

సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో ఓకుటుంబం నివాసం ఉంటుంది. రోజూ లాగానే లేచిన మహిళ వంట చేసేందుకు గ్యాస్‌ అంటించింది. అంతే ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ప్రజలు భయాందోళనతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు పెట్టారు. బయటకు వచ్చిన స్థానికులకు అరుపులు వినపడడంతో గ్యాస్‌ పేలిన ఇంటి వైపు పరుగులు పెట్టారు. అక్కడికి వెళ్లి చూడగా.. భారీగా మంటలు ఉవ్వెత్తున చెలరేగుతున్నాయి. కొందరు నీళ్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేపట్టారు.

అయితే పేలుడు ధాటికి ఇంటి పై కప్పు ఎగిసి పడింది. పక్కనే ఉన్న మరో ఇంటికి మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు, పొగ కమ్ముకుంది. స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement