Sunday, May 12, 2024

Shocking | పసిపిల్లల్లో వికృత చేష్టలు.. మూడేళ్ల బాలికపై పదేళ్ల బాలుడి అఘాయిత్యం!

సినిమాలు, ఓటీటీల ఎఫెక్ట్​.. స్మార్ట్​ఫోన్​లో ఎడాపెడా వచ్చే బూతు అడ్వర్టైజ్​మెంట్లతో పసిపిల్లలు కూడా ఎఫెక్ట్​ అవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్​నగర్​ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల ఓ బాలికపై పదేళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అత్యాచారం ఆరోపణలపై ఆ బాలుడిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్​కు తరలించారు. నిన్న (శనివారం) తమ కూతురిని, ఆ బాలుడు స్కూల్ భవంతిపైకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బాలుడు ఒకటో తరగతి చదువుతుండగా, బాలిక కిండర్‌గార్టెన్‌లో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement