Saturday, April 27, 2024

EVలకు పెరుగుతున్న క్రేజ్.. రికార్డులు కొడుతున్న MG అమ్మకాలు..

MG మోటార్ ఇండియా ZS EV ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUVకి దేశంలో డిమాండ్‌ పెరుగుతున్నట్టు అమ్మకాల తీరు చెబుతోంది. చైనీస్ యాజమాన్యంలోని బ్రిటిష్ కార్‌ మేకర్ ఇటీవలే తన EV అమ్మకాల వివరాలను వెల్లడించింది. 2021లో 2,798 యూనిట్లు అమ్ముడయినట్టు ఎంజీ మోటర్స్ ప్రకటించింది. 2020లో అమ్మిన 1,142 యూనిట్లతో పోలిస్తే.. బ్రాండ్ 145 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసినట్టు చెప్పుకొచ్చింది. ZS EV ప్రస్తుతం ఆటోమేకర్ యొక్క EV లైనప్‌లో ఏకైక ఎలక్ట్రిక్ ఆఫర్ గా ఉందని చెబుతోంది ఎంజీ మోటర్స్ కంపెనీ. కంపెనీ ప్రెస్ స్టేట్‌మెంట్ ప్రకారం నెలకు దాదాపు 700 బుకింగ్‌లు వస్తున్నట్టు తెలుస్తోంది.

MG ZS EV ఇండియాలో తొలిసారిగా 2020లో లాంచ్ అయ్యింది. కాగా, దీని ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ గత ఏడాది ఫిబ్రవరిలో వచ్చింది. ఆల్-ఎలక్ట్రిక్ SUV రెండు ట్వమ్లలో వస్తుండగా.. ఎక్సైట్, ఎక్స్ క్లూజివ్. మునుపటి ధర ₹21.50 లక్షలు కాగా, రెండోది ₹25.18 లక్షల ధర ఉంది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

MG ZS EV 44.5 kWh హై-టెక్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని ఎంజీ మోటార్స్ పేర్కొంది, ఇది శాశ్వత మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌కు పవర్ ఇస్తుందని, 141 బిహెచ్‌పి, 353 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను డెవలప్ చేస్తుందని సంస్థ తెలిపింది. ARAI సర్టిఫైడ్ శ్రేణి ఒక్కసారి ఛార్జ్ పై 419 కిమీగా ఉండగా, వాతావరణం, డ్రైవింగ్ పరిస్థితులను బట్టి ఈ SUV 300 నుండి 400 కిమీల మైలేజీ ఇస్తున్నట్టు తెలిపింది. అంతేకాకుండా ఇది కేవలం 8.5 సెకన్లలో 0 టు -100 kmph వేగాన్ని అందుకోగలదని ఎంజీ మోటార్స్ చెబుతోంది.

ఇక చార్జింగ్ విషయానికొస్తే, 50kW DC ఫాస్ట్ చార్జర్ ద్వారా కేవలం 50 నిమిషాల్లో 80 శాతం వరకు చార్జ్ చేయవచ్చని, అయితే, కస్టమర్‌లు కారుతో పొందే 11kW AC చార్జర్‌ ద్వారా అయితే దాదాపు 8 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు టెక్నీషియన్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement