Friday, March 29, 2024

గతేడాదిలాగే పవర్‌ ‘ ఫుల్‌ ‘ డిమాండ్‌.. ..

తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో గత ఏడాదిలాగే ఈసారి కూడా విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగింది. వరికి ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో.. రైతులు యధావిధిగా వరిని సాగు చేస్తున్నారు. దీంతో మరోసారి తెలంగాణలో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. యాసంగి పంటల విషయంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకుంటారని భావించినప్పటికీ.. వరినే సాగు చేయడంతో ఈసారి గణనీయంగా విద్యుత్‌ వినియోగం పెరిగింది.

ఇది కూడా చ‌ద‌వండి : రాజ’శేఖర్‌’లో శివానీ.. వెండి తెరపై తండ్రి కూతురు…

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు రైతులు. ప్రతి ఏడాది వరి సాగు గణనీయంగా పెరగడంతో విద్యుత్‌ వినియోగం పెరుగుతూ వస్తోంది. దానిలో భాగంగా గత సంవత్సరం జనవరి మొదటి వారంలో 11,532 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం జరగగా.. ఈసారి కూడా అదే స్థాయిలో అది 11,240 మెగావాట్లకు చేరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement