Wednesday, May 15, 2024

మెగాస్టార్ కి జోడీగా మాళ‌విక మోహ‌న‌న్ !

మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న త‌మిళ బ్యూటీ మాళ‌విక మోహ‌న‌న్ న‌టించ‌నుంద‌నే టాక్ వినిపిస్తోంది. ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా మాళ‌విక న‌టించ‌నుంద‌ట‌. కాగా తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో మాళవిక మోహనన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తాజాగా హీరో ధనుశ్ తో చేసిన మారన్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మాళవిక మోహనన్ తెలుగులో ఇంతవరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటుంది .. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement