Saturday, April 27, 2024

Snakes in pants: ప్యాంటులో దాచిపెట్టి పాముల స్మగ్లింగ్​.. అరుదైన కొండచిలువలు అమెరికాకు తరలింపు!

కెనడా నుంచి అమెరికాకు మూడు అరుదైన జాతికి చెందిన కొండచిలువలను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడో వ్యక్తి. అయితే వాటిని బోర్డర్​ దాటించే క్రమంలో తన ప్యాంటులోపల దాచిపెట్టినట్టు తెలుస్తోంది. 2018లో జరిగిన ఈ ఘటనకి సంబంధించి ఇప్పుడు కోర్టులో వాదోపవాదనలు జరగుతున్నాయి. ఈ నేరం కనుక అతనిపై రుజువైతే.. అతనికి గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు $250,000 జరిమానా విధించనున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కెనడా నుంచి మూడు బర్మీస్ కొండచిలువలను స్మగ్లింగ్ చేసినట్లు యూఎఎస్​కి చెందిన వ్యక్తిపై ఆరోపణలు వచ్చాయి. ఈ సరీసృపాలను యూఎస్-కెనడియన్ సరిహద్దు మీదుగా అక్రమంగా తరలించే ప్రయత్నంలో ఆ వ్యక్తి తన ప్యాంటులో వాటిని దాచుకున్నాడని తెలుస్తోంది. కాల్విన్ బటిస్టా అనే వ్యక్తి 2018 జులై 15న ఉత్తర న్యూయార్క్ కు వెళ్లే బస్సులో ఆ పాములను తీసుకెళ్లినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది.

ఇక.. ఈ బర్మీస్ పైథాన్‌ల దిగుమతి అంతర్జాతీయ ఒప్పందం, సమాఖ్య చట్టంలో నిషేధం ఉంది. అయితే న్యూయార్క్​కు చెందిన బటిస్టా వీటిని స్మగ్లింగ్​ చేశాడనే నేరానికి సంబంధించి ఫెడరల్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. బర్మీస్ పైథాన్‌లు మానవులకు హానికరమైనవన్న జాబితాలో ఉన్నాయి. ఫెడరల్ స్మగ్లింగ్ ఆరోపణలపై బటిస్టాని ఈ వారం న్యూయార్క్ రాష్ట్ర రాజధాని అల్బానీలోని కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత విచారణ పెండింగ్‌లో ఉండగానే అతడిని విడుదల చేశారు.

బర్మీస్ పైథాన్ ప్రపంచంలోని అతిపెద్ద పాములలో ఒకటిగా చెబుతారు. ఆసియా ఖండంలో ఇది హానికరమైన పాము జాతిగా ఉంది. అయినప్పటికీ ఈ జాతి యునైటెడ్ స్టేట్స్ లోని ఫ్లోరిడాలో మనుగడ సాధించడం కష్టమనే తెలుస్తోంది. అయితే.. అక్కడ ఈ జాతి పాములు లోకల్​ జంతువులను చంపి తినేస్తాయన్న వాదన స్థానికుల్లో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement