Friday, April 19, 2024

ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైల్లను నడపున్నది. దసరా సెలవులవులకు సొంతూళ్లకు వెళ్లిన జనం తిరుగు ప్రయాణమవతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ నడుపనున్నది. సికింద్రాబాద్‌-యశ్వంత్‌పూర్‌ రైలు సోమవారం రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు గమ్యస్థానానికి చేరుకుకోనున్నది. సోమవారం పూర్తా-తిరుపతి మధ్య సింగిల్‌ వే స్పెషల్‌ ట్రైన్‌ను నడుపనున్నట్లు తెలిపింది.

రైలు రాత్రి 11.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు గమ్యస్తానానికి చేరనున్నది. అలాగే యశ్వంత్‌పూర్‌-సికింద్రాబాద్‌ రైలు మంగళవారం సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు గమ్యస్థానానికి చేరుతుంది. వీటితోపాటు మరికొన్ని రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఆయా సర్వీసులను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement