Friday, May 3, 2024

మ‌హేశ్ బాబుకి స‌ర్జ‌రీ నిజ‌మేనా ..!

ఏడేళ్ల నుంచి మోకాలికి సంబంధించిన స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నాడు టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు. అయినా రెస్ట్ లేకుండా షూటింగ్ ల‌లో పాల్గొనాల్సి వ‌స్తుంది. 2020లో స‌ర్జ‌రీ కూడా చేయించుకోవాల‌ని అనుకున్నారు. క‌రోనా అడ్డంకిగా మారింది. కాగా ప్ర‌స్తుతం ఆయ‌న స‌ర్కారు వారి పాట చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ స‌మ‌యంలో ఆయ‌న మోకాలికి గాయం కావ‌డంతో నొప్పి మ‌ళ్ళీ ఎక్కువ అయింద‌ట‌. దాంతో స‌ర్జ‌రీ చేయించుకునేందుకు మ‌హేశ్ బాబు సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని టాక్ వినిపిస్తుంది. ఒక‌వేళ సర్జరీ జరిగితే ఆయన రెండు, మూడు నెలల పాటు షూటింగ్ కు దూరం కావాల్సి ఉంటుంది. ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏమ‌వుతుందో చూడాలి మ‌రి.

Advertisement

తాజా వార్తలు

Advertisement