Sunday, April 28, 2024

పోలీసోడు కాదు కామాంధుడు.. మైనర్ బాలికపై..

బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగం చేస్తున్న ఓ కానిస్టేబుల్ కామ పిశాచిలా మారాడు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన మైనర్‌ బాలికపై లైంగికదాడికి యత్నించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌ పల్లి పరిధిలో చోటుచేసుకుంది. అయ్యప్పరెడ్డిగూడ కాలనీకి చెందిన శేఖర్‌ అనే వ్యక్తి కూకట్‌పల్లిలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతని ఇంట్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మేస్త్రీ కుటుంబం ఆరేళ్లుగా అద్దెకు ఉంటోంది. వీళ్లకు 14 ఏళ్ల అమ్మాయి ఉంది. అయితే, బాలిక ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడ్డాడు.

బాలిక కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తం అయి శేఖర్ ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసలకు అప్పగించారు. నిందితుడు శేఖర్‌పై శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో పోక్సో, ఎస్సీ,ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్‌ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం చేవెళ్ల ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అయితే, బాలిక ఇంట్లో.. కోడి గుడ్లు పెడుతుందని, చూసేందుకు వెళ్లానని శేఖర్‌ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చేవెళ్ల ఏసీపీ రవీందర్‌ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement