Sunday, May 19, 2024

‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ – ఎప్పుడంటే

యంగ్ హీరో నితిన్ సొంత బ్యాన‌ర్ లో నిర్మిత‌మ‌వుతోన్న చిత్రం మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం. ఈ సినిమా, గ్రామీణ నేపథ్యంలో అవినీతి రాజకీయాల చుట్టూ తిరుగుతుందట‌. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ ఆఫీసర్ సిద్ధార్థ రెడ్డిగా కనిపించనున్నాడని అంటున్నారు. కథా నేపథ్యానికి తగినట్టుగా, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసే తరహాలో ఈ సినిమా నుంచి ఒక ప్రకటనను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ అప్ డేట్ ను ఈ నెల 26వ తేదీ 10:08 నిమిషాలకి రిలీజ్ చేయనున్నట్టుగా చెప్పారు. బహుశా ఆ రోజున నితిన్ ఫ‌స్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. ఈ సినిమాలో నితిన్ సరసన నాయికలుగా కృతి శెట్టి – కేథరిన్ కనిపించనున్నారు. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించాడు. ‘భీష్మ’ తరువాత నితిన్ చేసిన మూడు సినిమాలు పరాజయాల జాబితాలో చేరిపోయాయి. దాంతో ఆయన ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement