Saturday, April 27, 2024

గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కోసం త్వరలో కొత్త పథకం

వంట గ్యాస్ సిలిండర్‌ సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెండు ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోంది. ఇందులో మొదటి ప్రతిపాదన.. ఎలాంటి సబ్సిడీ లేకుండా గ్యాస్ సిలిండర్లను ఏ వినియోగదారుడికైనా అమ్మడం. రెండో ప్రతిపాదన.. ఎంపిక చేసిన కొందరు వినియోగదారులకు మాత్రమే సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయడం. ఈ మేరకు గ్యాస్‌ సబ్సిడీపై పరిమితులను కేంద్రం విధించవచ్చని సమాచారం.

ప్రతిపాదిత కొత్త పథకం ప్రకారం కుటుంబ వార్షిక ఆదాయం రూ.10 లక్షలు, ఆపైగా ఉన్న కుటుంబాలకు గ్యాస్ సిలిండర్‌పై ఎలాంటి రాయితీ ఇవ్వరు. దీంతో అవసరమైన ప్రజలకే గ్యాస్‌ సబ్సిడీ ఇచ్చేందుకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. మరోవైపు కరోనా నేపథ్యంలో అంతర్జాతీయగా ముడి చమురు, గ్యాస్‌ ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది మే నుంచి ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా నిలిపివేసింది. గ్యాస్ రాయితీలను కూడా బాగా తగ్గించింది. 2020 ఆర్థిక ఏడాదిలో గ్యాస్‌ సిలిండర్లపై రూ.24,468 కోట్ల సబ్సిడీ ఇవ్వగా, 2021 ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం రూ.3,559 కోట్లు మాత్రమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement