Sunday, April 28, 2024

లైగ‌ర్ థీమ్ – ట్వీట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి క‌లిసి నిర్మిస్తున్న చిత్రం లైగ‌ర‌ర్. ఈ మూవీలో హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమా భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుండగా.. ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ గెస్ట్ గా కనిపించనున్నాడు. ఆగస్టు25 న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ ను మే 9 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. లైగర్ హంట్ మొదలు అంటూ హింట్ ఇచ్చిన మేకర్స్ తాజాగా ఆ సర్ ప్రైజ్ ఏంటో రివీల్ చేశారు. ‘లైగర్’ థీమ్ సాంగ్ ను మే 9 న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. “ఇండియా.. ఇప్పటివరకు చాలా ప్రశాంతంగా ఎదురుచూశాం.. ఇక మా వేట మొదలయ్యింది” అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement