Saturday, April 27, 2024

నివాసిత ప్రాంతంలో చిరుత.. భయాందోళన చెందుతున్న జనం

మలంగ్ ఘర్ అటవీప్రాంతం నుంచి సమీప నివాసిత ప్రాంతానికి వచ్చింది ఓ చిరుత. కాగా ముగ్గురు వ్యక్తులపై దాడి చేసింది. ఒక బిల్డింగ్‌లోకి చిరుత దూకిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ సంఘటన ముంబై సమీపంలోని కళ్యాణ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. చించ్‌పాడలోని నవరంగ్ సొసైటీ బిల్డింగ్‌ మొదటి అంతస్తులో చిరుతను చూసి అక్కడి నివాసితులు భయాందోళనకి గురయ్యారు. సహాయం కోసం వారు కేకలు వేశారు. కాగా, కొందరు హెచ్చరించినప్పటికీ పట్టించుకోకుండా ఒక వ్యక్తి ఆ భవనంలోకి వెళ్లాడు. దీంతో అతడిపై ఆ చిరుత దాడి చేసింది. స్థానికులు కొందరు కర్రలతో దానిని తరిమారు. దీంతో ఆ చిరుత పక్కనే ఉన్న మరో బిల్డింగ్‌లోకి దూకింది. దీంతో ఆ భవనంలోని నివాసితులు భయాందోళన చెందుతున్నారు. ఆ చిరుత ఇప్పటి వరకు ముగ్గురిపై దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నివాసిత భవనాల్లో తిరుగుతున్న చిరుతపులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

https://twitter.com/midhunnair18/status/1595649823486742528
Advertisement

తాజా వార్తలు

Advertisement