Wednesday, May 8, 2024

భారీ అగ్నిప్ర‌మాదం – 60దుకాణాలు, స్టాల్స్ ద‌గ్థం

ప్ర‌మాదవ‌శాత్తు అగ్రిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 60దుకాణాలు,స్టాళ్లు అగ్నికి ఆహుత‌య్యాయి. ఈ సంఘ‌ట‌న ఢిల్లీలోని ఎర్ర‌కోట ఎదురుగా ఉన్న లజపత్ రాయ్ మార్కెట్ లో చోటు చేసుకుంది. దాంతో ఘ‌ట‌నాస్థ‌లికి అగ్నిమాప‌క సిబ్బంది చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసుందుకు య‌త్నించారు. ఘ‌ట‌నాస్థ‌లంలో తీసిన వీడియోలో మంట‌లు ఎగిసిప‌డిన‌ట్టు క‌నిపించాయి. ఈ మంటల్లో దుకాణాలు పూర్తిగా కాలిపోయి దగ్ధమయ్యాయి. బూడిదగా మారిపోయాయి. అయితే ఈ అగ్నిప్రమాదానికి కారణమేమిటనే దానిపై ఇంకా సమాచారం లేదు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement