Sunday, May 19, 2024

Aha: ‘అహా’ అనిపించిన బాలయ్య.. ‘అన్‌స్టాపబుల్‌’కు టాప్ ప్లేస్

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్‌’ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. OTT ఫ్లాట్ ఫామ్ అయిన ‘ఆహా’లో ప్రసారమవుతున్న ఈ టాక్ షోలో బాలకృష్ణ తన హోస్టింగ్ స్టైల్ తో మెప్పించారు. మొదటి సీజన్ షూటింగ్ నిన్నటితో పూర్తయింది. అయితే తాజాగా బాలయ్య షో అరుదైన ఘనత సాధించింది.

IMDBలోని టాప్ 10 రియాలిటీ టీవీ జాబితాలో ‘అన్‌స్టాపబుల్’ స్థానం దక్కించుకుంది. ‘అన్‌స్టాపబుల్’ టాప్ రేటింగ్‌ లతో ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. ఇటీవల పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండలతో బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ చివరి ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. ఈ షో త్వరలో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement