Thursday, July 25, 2024

Sobhita : కేన్స్ లో తెలుగమ్మాయి కేవ్వు కేక

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అట్ట‌హాసంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. రెడ్ కార్పెట్ పై భార‌తీయ న‌టీమ‌ణుల బ్యూటీకి వ‌ర‌ల్డ్ అంతా ఫిదా అవుతుంది. ఒక్కొక్క‌రు త‌మ‌దైన శైలిలో డిజైన‌ర్ దుస్తుల్లో ఆక‌ట్టుకుంటున్నారు. ఈ వేడుక‌లో తొలిసారి తెలుగు న‌టి శోభిత దూళిపాళ కూడా భాగ‌మైంది. శోభిత న‌మ్ర‌త జోషిపూర్ జంప్ సూట్ లో రెడ్ కార్పెట్ పై వాక్ చేసింది. అత్యుత్త‌మ ఎంపికలో శోభిత త‌ళుక్కున‌ మెరిసింది.

- Advertisement -

మిరుమిట్లు గొలిపే పర్పుల్ కార్డెలియా జంప్‌సూట్‌లో అద్భుతమైన రూపాన్ని పొందింది. ఔట్‌ఫిట్, స్లీవ్‌లెస్ పీస్, రిచ్, డీప్ పర్పుల్ షేడ్‌లో డిజైన‌ర్ లో ఓ రేంజ్ లో ఆక‌ట్టుకుంది. అమ్మ‌డి మ్యాక‌ప్, యాక్స‌ర‌సీస్ ప్ర‌తీది ఆమె లో బ్యూటీని అంత‌కంత‌కు రెట్టింపు చేసింది.

ముఖ్యంగా శోభిత రింగు రింగు జుత్తు కేన్స్ లో స్పెష‌ల్ గా హైలైట్ అవుతుంది. సాధార‌ణంగా ఈ త‌ర‌హా స్టైల్ ని విదేశీ భామ‌లు ఎక్కువ‌గా చూజ్ చేసుకుంటారు. శోభిత డిజైన్ స‌హా బ్యూటీకి అంతా ఫిదా అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement