Monday, May 27, 2024

కీల‌క‌వ్యాఖ్య‌లు చేసిన మోహ‌న్ భ‌గ‌వ‌త్-హింస‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవ‌ద్దు

హింస‌తోకూడిన ఆహారాన్ని తీసుకోవ‌ద్ద‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్.
ప్రతి ఒక్కరూ తప్పుడు ఆహారం తీసుకోరాదన్నారు. హింసతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం మానేయాలని సూచించారు. భారత్ వికాస్ మంచ్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా భగవత్ మాట్లాడారు.వ్యక్తిత్వ వికాస అంశంపై భగవత్ మాట్లాడుతూ.. ‘‘మీరు తప్పుడు ఆహారాన్ని తీసుకుంటే అది మిమ్మల్ని తప్పుడు మార్గంలోకి నడిపిస్తుంది. తామసంతో కూడిన ఆహారాన్ని తీసుకోకూడదు. హింసతో కూడిన ఆహారాన్ని కూడా తీసుకోరాదు’’అని భగవత్ సూచించారు. మాంసాహారం తామసం కిందకే వస్తుంది. మాంసాహారం విషయంలో పాశ్చాత్యులు, భారతీయుల మధ్య వ్యత్యాసాన్ని కూడా భగవత్ ప్రస్తావించారు. ప్రపంచంలో ఇతరుల మాదిరే భారత్ లోనూ మాంసాన్ని తినేవారున్నారు. కానీ, మన దేశంలో మాంసాహారులు సైతం తమను కొంత నియంత్రించుకుంటూ, కొన్ని నియమాలను పాటిస్తుంటారు. మన దేశంలో మాంసాహారులు శ్రావణ మాసం మొత్తం దానికి దూరంగా ఉంటారు. సోమవారం, మంగళవారం, గురు లేదా శనివారాలు దాన్ని తీసుకోరు. వారు తమకంటూ కొన్ని నియమాలను పెట్టుకున్నార‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement