Saturday, June 1, 2024

TS : ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికలు

మంగపేట, మే 27 (ప్రభ న్యూస్): ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో భాగంగా సోమవారం మంగపేట మండలంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రశాంతంగా ప్రారంభమైంది. మండలంలో మొత్తం 1232 గ్రాడ్యుయేట్స్ ఓటర్లు ఉండగా మంగపేట జడ్పీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లో 906 మంది, రాజుపేట జడ్పీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లో 326 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు ఎలక్షన్ ఆఫీసర్లు తెలిపారు.

- Advertisement -

మండలంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను తహశీల్దార్ బైరి వీరాస్వామి, ఎంపీడీఓ ఎంపీడీఓ కృష్ణ ప్రసాద్, డిప్యూటీ తహశీల్దార్ మల్లేశ్వరరావు తదితరులు పర్యవేక్షిస్తున్నారు. మంగపేట ఎస్సై గోదరి రవి కుమార్ ఆధ్వర్యంలో మంగపేట సివిల్, సీఆర్పీయఫ్ పోలీస్ సిబ్బంది ఎలక్షన్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement