Monday, June 17, 2024

AP : తిరుప‌తి జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం…న‌లుగురు స్పాట్ డెడ్‌

ఏపీలోని తిరుప‌తి జిల్లాలో ఈ తెల్ల‌వారు జామున రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కొంగ‌రివారిప‌ల్లి ద‌గ్గ‌ర ఓ కారు క‌ల్వ‌ర్టును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా, మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

- Advertisement -

వీళ్లంతా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి బెంగళూరు వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, మృతులు నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇంకా మృతుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. కారు కల్వర్ట్‌లో ఇరుక్కున్న దాన్ని బట్టి అతివేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణాలుగా పోలీసులు అంచనా వేశారు.

ఇక, గడ్డపార సహాయంతో కల్వర్టుపై ఇరుక్కున్న కారు డోర్లను బద్ధలు కొట్టి మృతదేహాలను పోలీసులు బయటకు తీసేశారు. మృతుల వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement