Friday, June 14, 2024

TS : తొలి వేటు వేసిన మాజీమంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి

ఖమ్మం – నల్లగొండ – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఇవాళ జ‌రుగుతుంది. ఈ ఎన్నిక‌ల‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలోని 457 నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఆయన తొలి ఓటు వేశారు.

- Advertisement -

ఈ పోలింగ్‌ బూత్ పరిధిలో మొత్తం 673 మంది ఓటర్లు ఉండగా.. పోలింగ్‌ ప్రారంభానికి ముందే బూత్‌కు వచ్చిన జగదీశ్‌ రెడ్డి తొలి ఓటు వేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్లను లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరుసటి రోజైన జూన్‌ 5న లెక్కించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement