Saturday, April 27, 2024

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఫస్ట్ గోల్డ్ మెడల్.. చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి తొలి స్వర్ణ పతకం లభించింది. ఫురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో శనివారం పోటీపడిన నీరజ్ చోప్రా 87.58 మీటర్లతో బంగారు పతకాన్ని గెలుపొందాడు. వంద ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన భారతీయ అథ్లెట్‌‌గా రికార్డు సృష్టించాడు. జావెలిన్ త్రోలో ప్రత్యర్థులెవరూ నీరజ్ చోప్రా దరిదాపుల్లోకి కూడా రాలేదు. మొదటి ప్రయత్నంలోనే 87.03 మీటర్లు జావెలిన్‌ని విసిరిన నీరజ్ చోప్రా.. రెండో ప్రయత్నంలో 87.53, మూడో ప్రయత్నంలో 76.79 మీటర్లు ఈటెను విసిరి సత్తా చాటాడు. నాలుగో ప్రయత్నంలోనూ 80మీ దగ్గరగా జావెలిన్‌ని నీరజ్ చోప్రా విసిరాడు. కానీ అది ఫాల్ అయ్యింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటర్ అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ సాధించగా.. ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో పసిడి గెలిచిన రెండో భారత క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించాడు. ఒలింపిక్స్ చరిత్రలో అథ్లెటిక్స్‌లో భారత్‌కి పసిడి పతకం దక్కడం ఇదే తొలిసారి.

ఇది కూడా చదవండిః టోక్యో ఒలింపిక్స్‌: గోల్ఫ్ ఫైనల్లో చేజారిన పతకం

Advertisement

తాజా వార్తలు

Advertisement