Thursday, May 2, 2024

ఈనెల 14న వస్తున్న విశ్వక్‌సేన్ ‘పాగల్’

విశ్వక్‌సేన్ హీరోగా తెరకెక్కుతున్న ‘పాగల్’ మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈనెల 14న విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. బెక్కెం వేణుగోపాల్, నరేశ్ కుప్పిలి నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది.

మాస్, యూత్‌ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు జోడీగా నివేదా పేతురాజ్, సిమ్రన్ చౌదరి నటించారు. రథన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. మురళీశర్మ, రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ‘హిట్’ మూవీ తరువాత విశ్వక్‌సేన్ నటించిన సినిమా కావడంతో ‘పాగల్’పై మంచి అంచనాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement