Thursday, May 2, 2024

మహారాష్ట్ర : వ్యాపారి ఇంట్లో ఐటీ సోదాలు.. భారీగా నగదు స్వాధీనం

మహారాష్ట్రలోని ఓ వ్యాపారి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. అతని మొత్తం ఇళ్లు, ఆఫీస్‌లపై జరిపిన దాడుల్లో.. కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. ఏకంగా రూ.58 కోట్ల నగదు, 32 కిలోల బంగారం, రూ.16కోట్లు విలువైన వజ్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర జల్నాలో స్టీల్, గార్మెంట్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వ్యక్తి ఇళ్లు, ఆఫీసులపై ఆగస్టు 1న ఈ దాడులు ప్రారంభించారు ఐటీ శాఖ అధికారులు. 8వ తేదీ వరకు నిరంతరాయంగా సోదాలు జరిపారు. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదును యంత్రాల సాయంతో లెక్కించేందుకు 13 గంటలు పట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement