Saturday, April 27, 2024

IPL Final Clash | నేడే సిఎస్కే, గుజ‌రాత్ మ‌ధ్య మ‌హా సంగ్రామం

ఐపీఎల్‌-16 సీజన్‌ చివరి అంకానికి చేరుకుంది. రెండు నెలలుగా క్రికెట్‌ అభిమానుల్ని అలరించిన పొట్టి క్రికెట్‌ లీగ్‌లో నేడు ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. టైటిల్‌ కోసం చెన్నై సూపర్‌కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్లు అహ్మదాబాద్ లో అమీతుమీకి సిద్ధమయ్యాయి. విజేతను తేల్చే మహా సమరాన్ని వీక్షించేందు కు క్రికెట్‌ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐదోసారి కప్‌ గెలిచి ముంబై రికార్డును సమం చేయాలని ధోనీ సేన ఉవ్విళ్లూరుతుండగా, వరుసగా రెండోసారి కప్‌ గెలిచి సత్తా చాటాలని హార్దిక్‌ బృందం పట్టుదలతో ఉంది. బలాబలాల విషయానికొస్తే ఇరుజట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్న ప్పటికీ, గుజరాత్‌ టైటాన్స్‌కే ఫైనల్‌ నెగ్గే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అయితే ధోనీ వ్యూహాలతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అద్భుతం చేసే అవకాశమూ లేకపోలేదు.

సీఎస్‌కేకు ధోనీ వ్యూహాలే కీలకం..
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫైనల్స్‌కు చేరిందంటే అందుకు మిస్టర్‌ కూల్‌ ధోనీ కెప్టెన్సియే కారణం. మ#హ తనదైన వ్యూహాలతో జట్టును విజయపథంలో నడిపించాడు. లీగ్‌ దశలో రెండో స్థానంలో నిలిచినప్పటికీ, తొలి క్వాలిఫయర్‌లోనే డిఫెండింగ్‌ చాంఫియన్‌ గుజరాత్‌కు షాకిచ్చింది. ఇప్పుడు మళ్లిd ఫైనల్లో అదే జట్టుతో తుదిపోరుకు సిద్ధమైంది. మహేంద్రసింగ్‌ ధోనీకి దే ఆఖరి లీగ్‌ అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యలో, కప్‌ గెలిచి ధోనీకి కానుక ఇవ్వాలని చెన్నై అభిమానులు కోరుకుంటున్నా రు. సీఎస్‌కేకు ఓపెనర్లే ప్రధాన బలం. గైక్వాడ్‌, కాన్వేమరోసారి బ్యాట్‌ ఝులిపించారంటే గెలుపు తేలికవుతుంది. శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, రహానెలతో మిడిల్‌ ఆర్డర్‌ పటిష్ఠంగా ఉంది. తుషార్‌ దేశ్‌పాండే, పతిరణ, దీపక్‌ చా#హర్‌, తీక్షణ, జడేజా కీలక సమయాల్లో వికెట్లు తీస్తు జట్టుకు అండగా నిలుస్తున్నారు.

ఆల్‌రౌండ్‌ నైపుణ్యమే బలం..
అన్ని విభాగాల్లో దుమ్మురేపుతూ టైటిల్‌కు చేరువైన గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగిం చాలని చూస్తోంది. క్వాలిఫయర్‌ 1లో చెన్నైపై ఓడిపోయినప్ప టికీ, ముంబై అద్భుత ప్రదర్శనతో రెట్టించిన ఆత్మవిశ్వాసాన్ని పొందింది. శతకాల రికార్డులతో చెలరేగున్న ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ మరోసారి విధ్వంసం సృష్టిస్తే గుజరాత్‌కు తిరుగుండదు. సాయి సుదర్శన్‌, విజయ్‌ శంకర్‌, హార్దిక్‌ పాండ్య కూడా రాణిం చాల్సి ఉంది. అప్పుడు మాత్రమే చెన్నైని ఓడించడం సాధ్యమ వుతుంది. బౌలింగ్‌ ఎటాకింగ్‌లో పాండ్య బృందం పటిష్టంగా ఉంది. పర్పుల్‌ క్యాప్‌ రేసులో తొలి మూడు స్థానాల్లో ఉన్నది ఈ జట్టు బౌలర్లే. షమీ (28 వికెట్లు), రషీద్‌ ఖాన్‌ (27 వికెట్లు), మోహిత్‌ శర్మ(24) టాప్‌ వికెట్‌ టేకర్స్‌గా ఉన్నారు.

ముఖాముఖిలో గుజరాత్‌దే పైచేయి..
ఈ సీజన్‌ క్వాలిఫయర్‌ 1 మ్యాచ్‌ మినహాయిస్తే, ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు తలపడిన అన్ని మ్యాచ్‌ల్లో గుజరాత్‌దే విజయం. అయితే ప్లేఆఫ్స్‌ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ను ఓడించడం ద్వారా ధోనీ సేనలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. అదే దూకుడును ఫైనల్లో కొనసాగిస్తుందా..? లేదా గుజరాత్‌ ప్రతీకారం తీర్చుకుం టుందా..? అని ఈ రెండు జట్ల అభిమానులు ఎంతో ఆత్రుతగా ఫైనల్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అరంగే ట్రం చేసిన తర్వాత వరుసగా రెండు సీజన్లలో ఫైనల్‌కు చేరిన జట్టుగా గుజరాత్‌ ఇప్పటికే రికార్డు సృష్టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement