Wednesday, May 8, 2024

విజ‌య్ దేవ‌ర‌కొండ కి ఇన్ స్టాగ్రామ్ లో ’14మిలియ‌న్ల’ ఫాలోవ‌ర్స్‌

ఇన్ స్టాగ్రామ్ లో 14మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ తో స‌రికొత్త రికార్డును క్రియేట్ చేశాడు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఇన్ స్టాగ్రామ్ లో 14.4మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఆ త‌ర్వాతి స్థానంలో విజయ్ దేవ‌ర‌కొండ నిలిచాడు. దాంతో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. అంతేకాదు #14MRowdiesOnInsta పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ను తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ద‌ర్శ‌కుడు పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘లైగర్‌’ అనే సినిమాలో నటిస్తున్నాడు విజయ్ దేవ‌ర‌కొండ‌. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనన్యా పాండే , విజ‌య్ తో రొమాన్స్ చేయనుంది. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement