Saturday, May 18, 2024

సూర్య న‌టిస్తున్న ‘ఈటి’ మూవీ నుండి లిరిక‌ల్ సాంగ్

స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై క‌ళానిధి మార‌న్ నిర్మిస్తున్న చిత్రం ఈటి. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు పాండిరాజ్. ఈ మూవీలో హీరోగా సూర్య న‌టిస్తుండ‌గా, హీరోయిన్ గా ప్రియాంక మోహ‌న్ న‌టిస్తుంది. ఈ చిత్రం నుండి లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇమాన్ స్వ‌ర‌ప‌రిచ‌న బీట్ ఆక‌ట్టుకుంటుంది. యుగ‌భార‌తి సాహిత్యాన్ని అందించిన ఈ సాంగ్ ని ప్ర‌దీప్ కుమార్, వంద‌న శ్రీనివాస‌న్ బృందం ఆల‌పించింది. ఈ పాటలో సూర్య డిఫరెంట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. అలాగే కాస్ట్యూమ్స్ పరంగా కూడా మంచి మార్కులు దక్కించుకుంటోంది. ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాలో సత్యరాజ్ .. శరణ్య .. దేవదర్శిని .. సూరి ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయనున్నారు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement