Saturday, April 27, 2024

ఐసీయూల్లో పెరిగిన బాధితులు.. బెడ్లు హౌస్‌ఫుల్

కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లన్నీ దాదాపు నిండిపోయాయి. రెండువారాల్లోనే పరిస్థితి తీవ్రరూపం దాల్చగా, కరోనాతో ఎవరైనా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే బెడ్ దొరకడం అసాధ్యమవుతోంది. నగరంలో చిన్నచిన్న ఆసుపత్రుల్లో ఖాళీలున్నా బాధితుల ప్రాణభయాన్ని ఆసరా చేసుకొని భారీగానే దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే వైద్య కళాశాలల్లోని బెడ్లను వినియోగంలోకి తెస్తే కొంతలో కొంత ఊరట ఉండే అవకాశం ఉంది.

ఏప్రిల్ 20వ తేదీతో పోలిస్తే మే 5వ తేదీన గాంధీ ఆస్పత్రి మినహా నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లోని ఐసీయూల్లో, ఆక్సిజన్ పడకల్లో కోవిడ్ బాధితులు 15,747 మంది పెరిగారు. తొలుత ఆ సంఖ్య 5,827గా ఉన్నా ఇప్పుడు 21,574గా ఉంది. రెండు వారాల్లో 300 శాతం మంది కోవిడ్ రోగులు ఆస్పత్రుల్లో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement