Thursday, March 28, 2024

తెలంగాణ లో ఇవాళ, రేపు వర్షాలు

రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం వరకు ఉరు‌ములు, మెరు‌పులు, ఈదు‌రు‌గా‌లులు, వడ‌గం‌డ్లతో తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది. బుధవారం హైద‌రా‌బా‌ద్‌‌తో‌పాటు 19 జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలి‌క‌పాటి వర్షాలు కురి‌శాయి. ఈదు‌రు‌గా‌లులు వీచాయి. అత్యధికంగా మేడ్చల్‌ మల్కా‌జి‌గిరి జిల్లాలో 37.3, వికా‌రా‌బాద్‌ జిల్లా ధరూ‌ర్‌లో 36, మియా‌పూ‌ర్‌లో 32.8 మిల్లీ‌మీ‌టర్ల వర్షం కురి‌సింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement