Saturday, April 27, 2024

భారీగా పెరిగిన విమాన ఇంధన ధరలు.. కిలోలీటరు జెట్‌ ఫ్యూయల్‌ ధర లక్ష రూపాయలు

విమాన ప్రయాణికులను కలవరపరిచేలా జెట్‌ ఫ్యూయల్‌ ధరలు బుధవారం ఆల్‌టైమ్‌ గరిష్టాలకు చేరుకున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో జెట్‌ ఫ్యూయల్‌ ధరలు కూడా జీవనకాల గరిష్టాలకు ఎగిశాయి. ఈ ఏడాదిలో ధరలు పెరగడం వరుసగా ఇది ఆరోసారి. తొలిసారి కిలోలీటరు జెట్‌ ఫ్యూయల్‌ ధర రూ.లక్షకు పైకి చేరుకుంది. విమానాల నిర్వహణ ఖర్చులో ఎక్కువ భాగం ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌(ఏటీఎఫ్‌)గా ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కిలోలీటరు ఏటీఎఫ్‌ ధర 18.3 శాతం లేదా రూ.17,135.63 పెరిగింది. దీంతో కిలోలీటరు ఏటీఎఫ్‌ ధర రూ.1,10,666.29కు చేరుకుందని ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ధరల నోటిఫికేషన్‌లో పేర్కొన్నాయి. ఏటీఎఫ్‌ ధరలుకు రెక్కలు రావడంతో విమాన టిక్కెట్ల ధరలు కూడా పెరుగుతాయనే ఆందోళన ఉంది.

కాగా జెట్‌ ఫ్యూయల్‌ ధరలను ప్రతి నెలా 1వ తేదీన, 16వ తేదీని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు మారుస్తూ ఉంటాయి. అంతర్జాతీయ ఫ్యూయల్‌ ధరల మార్పుకు అనుగుణంగా వీటి ధరల మార్పు ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో గత వారం ఆయిల్‌ ధరలు 14 ఏళ్ల గరిష్టంలో బ్యారల్‌ 140 డాలర్లకు చేరుకుంది. ఉక్రెయిన్‌-రష్యా మధ్య నెలకొన్న యుద్ధ సంక్షోభ ప్రభావంతో ఆయిల్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఈ ఆయిల్‌ ధరలు 100 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ముంబైలో కూడా ఏటీఎఫ్‌ ధరలు కిలోలీటరు రూ.1,09,119.83కు చేరుకున్నాయి.

అదేవిధంగా కోల్‌కతాలో రూ.1,14,979.70కు చేరుకున్నాయి. చెన్నైలో జెట్‌ ఫ్యూయల్‌ ధర కిలోలీటరు రూ.1,14,133.73 వద్ద ఉంది. 2008లో క్రూడాయిల్‌ ధర బ్యారల్‌ 147 డాలర్లను తాకినప్పుడు కిలోలీటరు ఏటీఎఫ్‌ ధర రూ.71,028.26గా ఉంది. ఏప్రిల్‌ 1 నుంచి ఆరుసార్లు ధర పెరగడంతో ఏటీఎఫ్‌ ధరలు 50 శాతం వరకు పెరిగాయి. జెట్‌ ఫ్యూయల్‌ ధరలు పెరుగుతున్నా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగానే ఉన్నాయి. వరుసగా 132వ రోజూ పెట్రో ధరలు స్థిరంగా ఉన్నాయి. వంట గ్యాస్‌ ధరలు కూడా అక్టోబర్‌ నుంచి మారలేదు. కానీ కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర మాత్రం పెరిగింది.

FILE PHOTO: A business jet is refueled using Jet A fuel at the Henderson Executive Airport during the National Business Aviation Association (NBAA) exhibition in Las Vegas, Nevada, U.S. October 21, 2019. REUTERS/David Becker
Advertisement

తాజా వార్తలు

Advertisement