Monday, April 29, 2024

ఆవుపై పులి దాడి.. పులిపై ఆవుల మంద ఎదురుదాడి.. వీడియోతో

ఒంటరిగా వున్న ఆవుపై పులి దాడి చేసింది. దాంతో అక్కడే వున్న ఆవుల మంద కలిసికట్టుగా వెళ్లి పులిని భయపెట్టాయి. దాంతో తనపై దాడికి వచ్చిన మందను చూసిన పులి భయంతో అక్కడి నుంచి పరుగులు తీసింది. మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని కేర్వా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.ఆవుల మంద దాడిచేయడంతో పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిన పులి తిరిగి దాడిచేసేందుకు సమయం కోసం దాదాపు మూడు గంటలపాటు వేచి చూసినా ఫలితం లేకుండా పోయింది. పులి దాడిలో గాయపడిన ఆవు చుట్టూ చేరిన మిగతా ఆవులు ఆ రాత్రంతా దానికి రక్షణగా నిలిచాయి. ఉదయం గాయపడిన ఆవును చూసిన యజమాని దానిని ఆసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం దాని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేర్వా ప్రాంతంలో 76 ఎకరాల్లో ఫామ్ ఉంది..ఈ ఫామ్ లో దాదాపు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement