Sunday, May 12, 2024

Breaking: ఇక‌మీద‌ట మాస్క్ మస్ట్, మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన వైద్యశాఖ

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమైన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్ర‌మ‌త్త‌మయ్యింది. ఈ మేర‌కు ప‌లు హెచ్చరికలు జారీ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాల ఒక్కరోజే 403 కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటికే మొత్తం 7.69 లక్షల కేసులుండగా, ఇందులో 4,111 మంది చనిపోయారు. ఈ క్రమంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ రాష్ట్ర ప్రజలకు ప‌లు ర‌కాల సూచ‌న‌లు, హెచ్చ‌రిక‌లు చేశారు.

కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి వారు జాగ్రత్తలు పాటించాలని కోరారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ఇక.. చిన్నపిల్లలు, వృద్దుల విషయంలో మరింత కేర్ తీసుకోవాలన్నారు. అత్యంత అవసరమైతే కానీ బయటకు రావాలని, లేకుంటే ఇంట్లోనే సేఫ్గా ఉండేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ప్రజలు తప్పకుండా మాస్క్లు ధరించాలని కోరారు. ఇప్పటిదాకా వ్యాక్సిన్ తీసుకోని వారు త్వరగా వేసుకోవాలని సూచించారు శ్రీనివాసరావు.

Advertisement

తాజా వార్తలు

Advertisement