Sunday, April 28, 2024

ద‌ళ‌పతి విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్.. వ‌రిసు టైటిల్ ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌..

ద‌ళ‌ప‌తి విజయ్ ప్రస్తుతం తన 66వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా దళపతి 66కి ‘వరిసు’ అనే టైటిల్‌ను ప్రకటించారు. బాస్ మళ్లీ ‘వరిసు’గా వస్తున్నాడు.. అంటూ సినిమా ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. మూవీలో హీరో వ్యాపారవేత్తగా కనిపిస్తాడు. ఒకరోజు ముందుగానే బర్త్ డే ట్రీట్ ఇవ్వడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అనే హ్యాష్‌ట్యాగ్‌ల‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, యోగి బాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత క్రిష్ తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని 2023 ప్రారంభంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా ఉన్నారు. తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌ తొలిసారిగా తెలుగు చిత్రంలో నటిస్తుండడంతోపాటు దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. విజయ్ ఇటీవల విడుదలైన ‘మృగం’ పరాజయం పాలవడంతో ఈ చిత్రం విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement