Monday, May 6, 2024

త‌న మూత్రం తానే తాగుతున్న వ్య‌క్తి – ఎందుకో తెలుసా

ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవడానికి ఒక్కొక్క‌రు ఒక్కో ప‌ద్ద‌తిని ఫాలో అవుతుంటారు. అయితే ఇక్క‌డ మ‌నం చూస్తున్న వ్య‌క్తి త‌న ఆరోగ్యం కోసం ఏమి చేశాడో తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే. ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ మ్యాటడీన్‌ వయస్సు 34 ఏండ్లు. 2016 కంటే ముందు డిప్రెషన్‌, ఇతర మానసిక సమస్యలతో తీవ్ర వేదనను అనుభవించాడు. ఎవరు చెప్పారో.. ఏమోగానీ.. డిప్రెషన్‌ దూరం కావడానికి తన మూత్రం తనే తాగాడు. ఆశ్చర్యకరంగా అతని ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు అనిపించింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వ‌ర‌కు రోజూ పావు లీటరు మూత్రాన్ని తాగుతూనే ఉన్నాడు. మూత్రం తాగడం వల్ల మానసిక సమస్యలు తగ్గడమే కాకుండా 10 ఏండ్లు యవ్వనంగా కనిపిస్తున్నానని హ్యారీ తెలప‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement