Friday, May 3, 2024

4 నుంచి చంద్ర‌బాబు జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు

ఈనెల 4వ తేదీ నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిరసన కార్యక్రమాల్లో భాగంగా జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. ఈనెల‌ 4వ తేదీ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో చంద్రబాబు పర్యటించనున్నారు. 5వ తేదీ భీమిలి నియోజకవర్గం తాళ్లవలస గ్రామంలో, 6వ తేదీ ముమ్మడివరం నియోజవర్గం కోరింగ గ్రామంలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు, వివిధ రకాల పన్నులపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ‘బాదుడే బాదుడు పేరిట తెలుగుదేశం నేతలు నిరసనలు చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement