Sunday, May 5, 2024

అల్లు అర్జున్ ఒక ల్యాండ్ మార్క్ – బ‌ర్త్ డే విషెష్ తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

మీ కృషి..మీ ఏకాగ్ర‌త అవే మిమ్మ‌ల్ని విజ‌య‌ప‌థంలో న‌డిపిస్తాయ‌ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు మెగాస్టార్ చిరంజీవి. నేడు అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బ‌న్నీకి బ‌ర్త్ డే విషెష్ తెలియ‌జేశారు చిరు. బన్ని ఒక ల్యాండ్ మార్క్ అని కొనియాడారు. ఈ పుట్టిన రోజుని గుర్తుండిపోయేలా జరుపుకోవాలని చిరు తన ట్విట్టర్ వేదిక ద్వారా బన్నీ కి శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్ప సినిమాతో బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకొన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ పాన్ ఇండియా సినిమా తీయనున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ ఇటీవల బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ ని కలవడం గత నెలలో చర్చనీయాంశమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement