Saturday, April 27, 2024

హైదరాబాద్​లో వర్క్​ స్టార్ట్​ చేసిన గ్రిడ్ డైనమిక్స్.. వెయ్యి మంది ఉద్యోగులతో పని

ప్రముఖ డిజిటల్ కన్సల్టింగ్ కంపెనీ గ్రిడ్ డైనమిక్స్ హైదరాబాద్ లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. అంతర్జాతీయంగా తన విస్తరణ ప్రణాళికలో భాగంగా ఇవ్వాల (సోమవారం) దేశంలో తన కార్యకలాపాలను హైదరాబాద్ కేంద్రంగా ఎంచుకున్న ట్లు తెలిపింది. ఈ ఏడాదిలో ఇక్కడి నుంచి సుమారు 1000 మంది ఉద్యోగులు కంపెనీ కోసం పని చేయనున్నట్లు మంత్రి కే తారక రామారావుతో జరిగిన భేటీలో కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం తెలియజేసింది. కంపెనీ సీఈఓ లియోనార్డ్ లివ్స్చిట్జ్ (Leonard Livschitzతన ప్రతినిధి బృందంతో మంత్రి. కేటీఆర్​ను ప్రగతి భవన్​లో కలిశారు. హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో పాటు అద్భుతమైన ఏ గ్రేడ్ కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయని, అన్నిటికన్నా ప్రధానంగా ఉన్నత విద్యా ప్రమాణాలు, నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు అందుబాటులో ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అందుకే తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలకు భారత్ లో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement