Tuesday, May 14, 2024

TS | జేపీఎస్​లకు గుడ్​న్యూస్​.. క్రమబద్ధీకరణకు సీఎం కేసీఆర్​ ఆదేశం

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు కేసీఆర్​ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జేపీఎస్‌ల సర్వీస్‌ను క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాను సీఎం ఆదేశించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణపై ఇవ్వాల (సోమవారం) రాత్రి కొద్దిసేపటి క్రితం చర్చించారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

జేపీఎస్‌ల పనితీరును పరిశీలించి, వారిని క్రమబద్ధీకరించేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. కలెక్టర్‌తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, జిల్లా అటవీ అధికారి, జిల్లా ఎస్పీ లేదంటే డీసీపీలు కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి కార్యదర్శి లేదంటే.. శాఖ ఉన్నతస్థాయి అధికారి జిల్లా కమిటీకి పరిశీలికుడిగా వ్యవహరించనున్నట్టు సీఎం తెలిపారు.

- Advertisement -

రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ ఉంటుందని.. జేపీఎస్‌ల పనితీరుపై జిల్లాస్థాయి కమిటీ పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలించనుంది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (సీఎస్‌) నివేదిక అందజేస్తుంది. ఆ తర్వాత క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. కాగా, పలుచోట్ల తాత్కాలిక ప్రాతిపదికన పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్లు నియమించిన విషయం తెలిసిందే. ఆయా స్థానాల్లో కొత్త జేపీఎస్‌ల భర్తీ ప్రక్రియ, క్రమబద్ధీకరణ తర్వాత దశను ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement