Saturday, April 27, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయో చూద్దాం.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గ ప్రస్తుతం రూ.52 వేల 500 లకు దిగొచ్చింది. కొద్ది రోజులుగా ర్యాలీ చేసిన పసిడి రూ. 53 వేల పైనే ఉంది. ప్రస్తుతం ధరలు దిగిరావడం పసిడి ప్రియులకు ఊరట కల్పిస్తోంది. ఇదే క్రమంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగానే దిగొచ్చింది. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ.660 మేర తగ్గింది. ప్రస్తుతం రూ. 57,270 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీలో కూడా బంగారం ధర తగ్గింది. అక్కడ 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.600 మేర తగ్గింది. ప్రస్తుతం రూ. 52 వేల 650గా పలుకుతోంది.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.660 తగ్గి రూ. 57,420 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో బంగారం ధరలు కాస్త ఎక్కువాగనే ఉంటాయి. స్థానికంగా ఉండే పన్నులు, పరిస్థితులు దీని ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.బంగారం ధరలు దిగొచ్చిన నేపథ్యంలో వెండి రేట్లు కూడా హైదరాబాద్, దిల్లీలో ఎలా ఉన్నాయో చూద్దాం. పసిడి దారిలో వెండి ధరలు కూడా స్వల్పంగా దిగొచ్చాయి. హైదరాబాద్‌ల కిలో వెండి రేటు రూ.400 మేర తగ్గింది. ప్రస్తుతం రూ. 74,600 కు చేరింది. ఇక దేశ రాజధాని దిల్లీ కిలో వెండి రేటు శుక్రవారం రూ.100 పెరగగా.. శనివారం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం రూ.72 వేల 600 వద్ద కొనసాగుతోంది. దిల్లీలో పోలిస్తే హైదరాబాద్‌లో గోల్డ్ రేటు తక్కువగా ఉన్నప్పటికీ… సిల్వర్ రేటు మాత్రం ఎక్కువగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement