Wednesday, May 8, 2024

తగ్గిన బంగారం..పసిడి బాటలోనే వెండి

నేడు బంగారం ..వెండి ధరలు ఇలా ఉన్నాయి..మన బులియన్ మార్కెట్ విషయానికి వస్తే రేట్లు తగ్గుతున్నాయి. రెండు రోజులు పెరుగుతూ, మళ్లీ రెండు రోజులు తగ్గుతూ ఇలా ఉంటున్నాయి. అక్టోబర్ 26,27 తేదీల్లో హైదరాబాద్‌లో వరుసగా రూ.150, రూ.100 మేర గోల్డ్ రేట్లు పెరిగాయి. మళ్లీ ఒక రోజు స్థిరంగా ఉండి ఇవాళ మళ్లీ తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ. 350 తగ్గింది. దీంతో అంతకుముందు రోజు రూ.47,100గా ఉన్న ధర ఇప్పుడు 46 వేల 750 రూపాయలకు పడిపోయింది. ఇక 24 క్యారెట్లకు 10 గ్రాముల బంగారం విషయానికి వస్తే హైదరాబాద్‌లో రేటు ఏకంగా రూ.380 తగ్గింది. దీంతో రూ. 51,380 నుంచి రూ.51 వేలకు పడిపోయింది.వెండి ధరలు కూడా భారీగానే తగ్గుతున్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలోకు ఏకంగా రూ.700 మేర పతనమైంది. దీంతో ముందు రోజు రూ.63 వేల 700 గా ఉన్న రేటు ఇప్పుడు రూ.63 వేలకు పడిపోయింది. అంతకుముందు రోజు రూ.200 పెరిగిన వెండి.. అంతకుక్రితం రూ.1000 పడిపోయింది. ఇక పండగ సీజన్ సమయంలో వరుసగా వారం, 10 రోజుల వ్యవధిలో ఏకంగా రూ.6500 మేర వెండి రేటు పతనం అవడం విశేషం. బంగారం, వెండి కొనేముందు అంతా హాల్‌మార్క్ చూసుకోవాలి. ఇది స్వచ్ఛతను నిర్ణయిస్తుంది. 22 క్యారెట్ల బంగారాన్నే ఆభరణాల తయారీలో వినియోగిస్తారు. అది తెలుసుకోవాలి. ఇక బంగారం, వెండి ధరలు ప్రాంతాలను బట్టి మారుతుంటాయని గమనించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement