Friday, April 26, 2024

Gold Rate Today : నేటి బంగారం, వెండి ధరలు ఎంతంటే?

నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.46,650గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల ధర రూ.50,890గా నమోదవుతోంది. బంగారం ధరతో పాటు సిల్వర్ రేటు కూడా మారలేదు. సిల్వర్ రేటు కేజీ రూ.58,200గా నమోదవుతోంది. విజయవాడలో కూడా 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా రూ.46,650 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,890 వద్ద పలుకుతున్నాయి. అలాగే వెండి రేటు కూడా విజయవాడలో రూ.58,200గానే ఉంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్థిరంగా నమోదవుతున్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.46,800గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన బంగారం ధర రూ.51,050 వద్ద రికార్డవుతుంది. ఇక పోతే సిల్వర్ రేటు ఢిల్లీలో రూ.52,500గా ఉంది. కాగా, గత వారమంతా చాలా వరకు బంగారం ధరలు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో, ఇటు బులియన్ మార్కెట్లలో రేట్లు కనిష్ట స్థాయిలకు దిగొచ్చి బంగారం కొనుగోలు చేసే వారికి ఆకర్షణీయంగా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement