Thursday, May 30, 2024

స్థిరంగా బంగారం ధ‌ర‌లు-పెరిగిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. కాగా వెండి ధ‌ర‌లు మాత్రం ప‌రుగులు పెట్టాయి.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. అయితే వెండి మాత్రం పైకి చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో బంగారం ధర తగ్గకపోవడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్‌లో జూలై 19న బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 24 క్యారెట్ల బంగారం ధరలో మార్పు లేదు. 10 గ్రాములకు ఈ బంగారం ధర రూ. 50,390 వద్దనే కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు కూడా ఇదే దారిలో నడిచింది. పది గ్రాములకు రూ. 46,190 వద్ద నిలకడగా కొనసాగుతూ వస్తోంది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి త‌రుణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement